- Advertisement -
తెలంగాణను చలి వణికిస్తోంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా చలితీవ్రత పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. రాత్రి వేళ్లలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా ఐదు డిగ్రీలకు పడిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు.
ఏజెన్సీ మండలాల్లోని ఆదివాసీ గూడాలు చలికి గజగజ వణుకుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చలి ప్రతాపం చూపుతుండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చల్లని గాలులతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
- Advertisement -