అమర కర్షకులకు మద్దతుగా రైతుల నిరాహార దీక్ష

45
farmers

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన 26వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు చలి పెరుగుతున్న రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటివరకు 29 మంది రైతులు చనిపోగా వీరికి సంఘీభావంగా ఇవాళ నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.

రైతు సంఘాలకు ఎన్నారైల నుంచి అందుతున్న విరాళాలపై బ్యాంకులు దృష్టి సారించాయి. సరైన అనుమతులు లేకుండా విదేశాల నుంచి నిధులు అందుకుంటున్నారంటూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ-ఉగ్రహన్‌)ను బ్యాంకు హెచ్చరించింది. రైతుల నిరసనోద్యమానికి అడ్డంకులు సృష్టించేందుకు రైతు సంఘాలపై పన్ను చట్టాలను ప్రయోగించడం కేంద్రం ఎత్తుగడ అని పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ విమర్శించారు.