సెమీస్‌లో ఓడినందుకు విచారంగా ఉంది- పీవీ సింధు

51
sindhu

భారత స్టార్‌ షట్లర్ పీ.వీ. సింధుకు టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశే ఎదురైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజూయింగ్‌తో నేడు జరిగిన సెమీస్‌లో తలపడిన సింధూ వరుస సెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. కాగా.. ఈ ఫలితంపై సింధూ తాజాగా స్పందించింది. బంగారు పతకం గెలుచుకునే అవకాశం చేజారినందుకు విచారంగా ఉందన్న ఆమె..కాంస్య పతకం గెలుచుకుంటానన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేసింది.

‘‘సెమీ ఫైనల్స్‌లో ఓడినందుకు విచారంగా ఉంది. అయితే..ఈ మ్యాచ్‌లో నా శక్తినంతా ధారపోశా. చివరి వరకూ పోరాడా. కానీ ఈ రోజు నాది కాకుండా పోయింది. తైజూయింగ్‌ను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యా. కానీ..సెమీస్‌ స్థాయి మ్యాచ్‌లో పాయింట్లు గెలవడం అంత సులభం కాదు. పతకం గెలుచుకునే అవకాశం ఇంకా ఉంది. దానిపైనే దృష్టి పెడతా.’’ అని ఆమె కామెంట్ చేశారు.  కాగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 18-21, 12-21 తేడాతో సింధు తైజు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.