- Advertisement -
తెలంగాణలో కరోనా కేసులు భారీ తగ్గాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 35,837 కరోనా పరీక్షలు నిర్వహించగా, 311 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 614 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,79,893 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,092 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111కి పెరిగింది.
- Advertisement -