రాష్ట్రంలో కొత్తగా 236 కరోనా కేసులు..

37
covid
- Advertisement -

రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల నెమ్మదిగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 2 వేలు దాటింది. గత 24 గంటల్లో 19,715 శాంపిల్స్ పరీక్షించగా, 236 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,026 మంది చికిత్స పొందుతున్నారు. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 180 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,96,055 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,918 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

- Advertisement -