తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..

375
telangana rains
- Advertisement -

తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వెదర్ అప్ డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ.ఉత్తర ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 2.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది వాతావరణ శాఖ.

దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -