టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు తెలంగాణలో ఛత్తీస్‌గఢ్ పాలన అమలు చేస్తామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఛత్తీస్‌గఢ్ ప్రజల మాదిరి తెలంగాణ ప్రజలు వలస పోవాలా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. చెన్నూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో హరీశ్‌రావు ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ చేసిన మంచి పనులు మన కళ్ల ముందు ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎంత పెన్షన్ వస్తుంది రూ. 500. అంటే తెలంగాణలో ఇస్తున్న రూ. 2016 పెన్షన్ వద్దా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలో యాసంగిలో వడ్లే కొనరు. సీఎం కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేయడంతో పాటు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొంటున్నామని తెలిపారు. ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం చేయాలంటే ఎన్నో తంటాలు పడ్డారు. ఎరువులకు, విత్తనాలు దొరక్క ఇబ్బంది పడేవారు.
కరెంట్ కోసం తంటాలు, పండిన పంట అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోయేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి గింజను కొంటున్నామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మకండి. సమాధులు తవ్వేటోడ కావాల్నా.. పునాదులు వేసేటోడు కావాల్నా ఆలోచించండి.. కేసీఆర్ ఈ కొత్త రాష్ట్రానికి బలమైన పునాదులు వేసిండు. కేసీఆర్ వేసిన బలమైన పునాదులు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. మన పథకాలను కేంద్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా పాటిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఇవాళ ఏం చేస్తదో…రేపు దేశం అదే చేస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి…