- Advertisement -
తెలంగాణలో ఇప్పటివరకు 364 కేసులు నమోదయ్యాయని తెలిపారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా 45 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు.
ప్రస్తుతం గాఃంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇకపై కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిందేనని స్పష్టం చేశారు.
మొదటి విడతలో 25937 మందిని క్వారంటైన్ చేయగా 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. వీరిలో విదేశాల నుంచి వచ్చిన 30 మందికి వారి కుటుంబ సభ్యులు 20 మందికి పాజిటివ్ వచ్చిందని వారిలో ఎవరు చనిపోలేదన్నారు.
చనిపోయిన వారంతా మర్కజ్‌లో పాల్గొని వచ్చిన వారేనని తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు సీఎం.
- Advertisement -