తెలంగాణ పోలీస్ శాఖ…అరుదైన ఘనత

218
dgp
- Advertisement -

తెలంగాణ పోలీస్ శాఖ అరుదైన ఘనత సాధించింది.రాష్ట్రంలో శాఖాపరమైన భూములు, ఆస్తులను గుర్తించి వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు డిజిటలైజ్ చేసిన మొట్ట మొదటి ప్రభుత్వ శాఖగా పోలీస్ శాఖ ప్రత్యేకత సాధించింది.

పోలీస్ శాఖ భూ వివరాల డాక్యుమెంట్ విడుదల సందర్బంగా నేడు రాష్ట్రం లోని పోలీస్ శాఖకు చెందిన 55 యూనిట్ లకు చెందిన పోలీస్ ఎస్టేట్ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ నేడు డీజీపీ కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రంలో పోలీస్ శాఖకు చెందిన 940 ఆస్తులను గుర్తించి వాటిలో 7050 ఎకరాల 24 గుంటల భూములున్నట్లు నిర్దారించామని వివరించారు.

167 పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలు ప్రయివేట్ భవనాలలో ఉన్నాయని,మరో 42 స్థలాలు పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను కేటాయించిందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ప్రజల భాగస్వామ్యంతో ఆరు లక్షలకు పైగా సి.సి. టీవీ లను ఏర్పాటు చేశామని, చైనా లోని నగరాలను మినహాయిస్తే లండన్ తర్వాత అత్యధిక సి.సి. టీవీ లున్న నగరంగా హైదరాబాద్ చరిత్రలో నిలిచిందని గుర్తు చేశారు. పోలీస్ శాఖ ఆస్తుల నిర్దారణ డిజిటలైస్ చేయడంద్వారా భూములు ఆక్రమణలకు గురికావని, పైగా ఏదైనా లీగల్ వివాదాలు ఏర్పడినా సరైన రికార్డులు స్పష్టమైన రీతిలో ఉంటాయని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -