జయరాం హత్యకేసులో ఛార్జ్‌షీట్‌..12మంది నిందితులు

374
jayaram murder case
- Advertisement -

ఎన్నారై జయరాం హత్యకేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు పోలీసులు..జయరాంను రాకేష్ రెడ్డి హత్యచేశారని తెలిపిన పోలీసులు రాకేష్ ను ఏ1 నిందితుడిగా చేర్చారు. జయరాంను కొట్టిన అనంతరం ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని పోలీసులు తేల్చారు. జయరం హత్యకేసులో 12 మందిని నిందితులుగా చేర్చాగా వీరిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. జయరాం హత్యను నిందితులు వీడియో తీసినట్లుగా గుర్తించారు.

A2గా విశాల్,A3గా శ్రీనివాస్(వాచ్ మాన్),A4గా నగేష్(రౌడీషీటర్),A5గా సూర్య ప్రసాద్ (కమేడియన్),
A6 కిషోర్ (సూర్య ప్రసాద్ స్నేహితుడు),A7 సుభాష్ రెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి),A8 బీఎన్ రెడ్డి (టీడీపీ నేత),A9 అంజిరెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి),A10 శ్రీనివాసులు (నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్),
A11 రాంబాబు (రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్),A12 మల్లారెడ్డి (ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ).

ఇక జయరాం హత్యకేసుతో సంబంధం ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండైనవారిలో ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబులు ఉన్నారు. జయరాం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని రాకేష్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. అంతేగాదు రాకేష్‌తో కలిసి భూదందాలు కూడా చేయడంతో వీరిని సస్పెండ్ చేశారు.

- Advertisement -