శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్‌…షాక్ అయ్యా:జేడీ

414
jd chakravarthy
- Advertisement -

చాలా రోజులుగా తెలుగు సినిమాల‌కు దూర‌మైన న‌టుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి `ఆర్ఎక్స్‌100` హీరో కార్తీకేయ న‌టించిన `హిప్పీ` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకువచ్చాడు. తెలంగాణ యాసలో జేడీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రీఎంట్రీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జేడీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తాను, రామ్ గోపాల్ వర్మ ప్రశ్నని బట్టే సమాధానం ఇస్తాం. అంతే తప్ప ప్రొజెక్ట్ చేసుకోవడానికి కామెంట్స్ చేయమని చెప్పారు. శ్రీదేవి విషయంలో మా ఇద్దరికి ఓసారి గొడవ జరిగిందన్నారు. గులాబీ సినిమా షూటింగ్ సమయంలో మహేశ్వరి ఇంటికి లంచ్‌కి వెళ్లానని తెలిపిన జేడీ..ఆ సమయంలో శ్రీదేవితో పాటు వాళ్ల అమ్మకూడా వచ్చారని చెప్పారు.

ఏం జరిగిందో తెలియదు కానీ శ్రీదేవి వాళ్ల అమ్మవచ్చి సడన్‌గా తన చేతులు పట్టుకుని మా బిడ్డను పెళ్లిచేసుకోమని అడిగారని చెప్పారు. 1985లో ఈ సంఘటన జరిగిందని ఇందులో అబద్దం లేదన్నారు. ఆ విషయం వర్మకు తెలిసి మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందన్నారు. ఎందుకంటే మా ఇద్దరికి శ్రీదేవి ఇష్టమని చెప్పిన ఆమెను ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేశామన్నారు.

మహేశ్వరితో ఎఫైర్ గురించి ఇప్పటికీ నన్ను అడుగున్నారు. ఆమెతో ఎఫైర్ వార్తల్లో వాస్తవం లేదన్నారు. మేం ఇద్దరం కలిసి నటించిన గులాబి సినిమాకు జనం బాగా కనెక్ట్ అయ్యారు. తెరపై మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకున్నారు. కానీ మేం ఇద్దరం మంచి స్నేహితులమే తప్ప ఎఫైర్ లాంటివి ఏం లేదని స్పష్టంచేశారు.

- Advertisement -