పంచాయతీ ఎన్నికల్లో కారు జోరు.. జిల్లాల వారీగా ఫలితాలు

215
TRS
- Advertisement -

తెలంగాణలో సోమవారం తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో ప్రజలు భారీగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిబంధనల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకే గడువు ముగిసినప్పటికీ లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. తొలి విడతలో 75 శాతానికిపైగా పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ పూర్తియినందున అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్‌ను ప్రారంభించారు.

Telangana Panchayat Election

ఎన్నికల్లో మొత్తం 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు, 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3,701 పంచాయతీలు, 28,976 వార్డులకు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో 12,202 మంది సర్పంచ్ లుగా, 70,094 మంది వార్డ్ మెంబర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, మిగిలిన రెండు విడతల పోలింగ్‌ను ఈ నెల 25, 30న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

TRS

తొలి విడత పోలింగ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌ మద్దతు పలికిన అభ్యర్థులు 2239 స్థానాల్లో జయకేతనం (ఏకగ్రీవంతో కలిపి) ఎగురవేశారు.

పార్టీ     గెలుపు
తెరాస-  2510
కాంగ్రెస్‌- 854
తెదేపా-  22
భాజపా- 62
సీపీఐ-  19
సీపీఎం- 30
ఇతరులు-700

జిల్లాల వారిగా ఫలితాలు..

జగిత్యాల :టీఆర్ఎస్ 47, కాంగ్రెస్ 21, ఇతరులు 34
జనగామ : టీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 16, ఇతరులు 7
ఆదిలాబాద్ : టీఆర్ఎస్ 101, కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఇతరులు 15
భద్రాద్రి కొత్తగూడెం :టీఆర్ఎస్ 57, కాంగ్రెస్ 28, టీడీపీ 2, ఇతరులు 20
జయశంకర్ భూపాలపల్లి : టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 35, ఇతరులు 14
గద్వాల : టీఆర్ఎస్ 58, కాంగ్రెస్ 13, ఇతరులు 6
కామారెడ్డి : టీఆర్ఎస్ 80, కాంగ్రెస్ 29, ఇతరులు 13
కరీంనగర్ టీఆర్ఎస్ 26, కాంగ్రెస్ 7, బీజేపీ 7, ఇతరులు 24
ఖమ్మం: టీఆర్ఎస్ 68, కాంగ్రెస్ 43, ఇతరులు 20
కుమ్రంభీం : టీఆర్ఎస్ 47, కాంగ్రెస్ 23, ఇతరులు 16
మహబూబాబాద్ : టీఆర్ఎస్ 67, కాంగ్రెస్ 28, ఇతరులు 11
మహబూబ్ నగర్ :టీఆర్ఎస్ 101, బీజేపీ 9, ఇతరులు 85
మంచిర్యాల : టీఆర్ఎస్ 41, కాంగ్రెస్ 3, ఇతరులు 23
మెదక్ :టీఆర్ఎస్100, కాంగ్రెస్ 23, ఇతరులు14
మేడ్చల్ :టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, ఇతరులు 3
నాగర్ కర్నూల్ :టీఆర్ఎస్ 85, కాంగ్రెస్ 22, ఇతరులు 16
నల్లగొండ : టీఆర్ఎస్ 82, కాంగ్రెస్ 29, ఇతరులు 13
నిర్మల్ : టీఆర్ఎస్ 90, కాంగ్రెస్ 21, ఇతరులు 11
పెద్దపల్లి : టీఆర్ఎస్ 32, కాంగ్రెస్ 12, ఇతరులు 8
రాజన్న సిరిసిల్ల : టీఆర్ఎస్ 32, కాంగ్రెస్ 6, ఇతరులు 12
రంగారెడ్డి : టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 33, ఇతరులు 17
సంగారెడ్డి : టీఆర్ఎస్ 115, కాంగ్రెస్ 34, ఇతరులు 11
సిద్దిపేట : టీఆర్ఎస్ 105, కాంగ్రెస్ 4, ఇతరులు 15
వికారాబాద్ : టీఆర్ఎస్ 122, కాంగ్రెస్ 60, ఇతరులు 23

 

- Advertisement -