ట్రెండింగ్‌లో నాట్‌ ఫర్‌ సేల్‌…

354
trs
- Advertisement -

దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ నేతల పాచికలు పారలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తూ విష పన్నాగం పన్నిన బీజేపీ నేతల కుట్రలు బట్టబయలయ్యాయి. నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు…ఒక్కొక్క ఎమ్మెల్యేకు వందకోట్లు ఇస్తామని భారీ ఆఫర్‌ బట్టబయలైంది. వందల కోట్ల కాంట్రాక్టులు కట్టబెడతామని ప్రలోభపెట్టారు. అడిగిన పదవులు కూడా అందిస్తామని ఎరవేసిన తెలంగాణ పోలీసుల ముందు వారి ఆటలు సాగలేదు. బీజేపీ దూతలను అరెస్ట్ చేసి భారీ నగదును పట్టుకున్నారు. గంటల కొద్దీ సాక్ష్యాధారాల వీడియో రికార్డు చేశారు. దీంతో ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారు పువ్వుపార్టీ నేతలు.

సోషల్ మీడియాలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు చేసిన ప్రయత్నాల వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఇప్పుడు ట్విట్టర్‌లో తెలంగాణ నాట్‌ ఫర్‌ సేల్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది.అర్ధరాత్రి వరకు తెలంగాణ నాట్‌ ఫర్‌ సేల్‌ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్‌ ట్యాగ్‌తో పలువురు వ్యక్తులు, సంస్థల ట్వీట్లు వెల్లువెత్తాయి.

బీజేపీ సిద్ధాంతాలను గాలికొదిలేసి వదిలేసి, ప్రజాప్రతినిధులను ఆంగట్లో సరుకులా కొనుగోలు చేస్తున్నదని నెటిజన్లు మండిపడుతున్నారు. శభాష్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మీరు తెలంగాణ హీరోలు అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

బీజేపీ సార్లు…వీరేవరో మీకు తెలియదా?

ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం!

టీఆర్‌ఎస్‌లో చేరిన రాపోలు

- Advertisement -