తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరిరోజు భారీ సంఖ్యలో ప్రధానపార్టీల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఆఫిడవిట్‌లో పలువురు అభ్యర్థుల ఆస్తులు చూస్తే కళ్లు తిరగక మానవు. ఎన్నికల్లో అత్యధిక ఆస్తులు చూపించిన వారిలో కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టాప్ ప్లేస్‌లో నిలిచారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 314,31,70,406 కోట్ల ఆస్తిని చూపించగా తర్వాతి స్థానంలో మర్రి జనార్దన్ రెడ్డి (టీఆర్ఎస్) : రూ. 161,27,26,168 నిలిచారు. కే అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్): రూ. 151,13,99,281,యోగానంద్ (బీజేపీ) రూ. 146,67,57,584,నామా నాగేశ్వరరావు (టీడీపీ) : 110,01,80,475 వంద కోట్లకు పైగా ఆస్తులను తమ నామినేషన్ పత్రాల్లో చూపించారు.
రూ. 50 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న వారిలో పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్ – జనగాం),వీరేందర్ గౌడ్ (టీడీపీ – ఉప్పల్), కే దయాకర్ రెడ్డి (టీడీపీ – మక్తల్), రాజేందర్ రెడ్డి (టీఆర్ఎస్ – నారాయణపేట), అమరేందర్ రెడ్డి (బీజేపీ – వనపర్తి), అమర్ సింగ్ (బీజేపీ – కార్వాన్), ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్ – పాలేరు),వి ఆనంద ప్రసాద్ (టీడీపీ – శేరిలింగంపల్లి)లు ఉన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన పేరిట రూ.4.55 కోట్లు, అలాగే ఆయన భార్య పేరిట రూ.61.88 లక్షలుగా పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌రావు పేరిట 4.కోట్ల 46 లక్షల ,ఆయన భార్య శ్రీనిత ఆస్తి విలువ 6 కోట్ల 79లక్షలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.