కొత్త సచివాలయం..ముహుర్తం ఖరారు?

30
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 14 డా. బీఆర్ అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు ఏ క్షణమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా పూజలు నిర్వహించే అవకాశం ఉంది.

తొలుత ఫిబ్రవరి 17 సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రారంభతేదీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించేందుకు తేదీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సమీకృత కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -