హైదరాబాద్ రవీంద్రభారతిలో జులై 4 నుండి 7 వరకు తెలంగాణ యువ నాటకోత్సవాలు జరగనున్నాయి. సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్త నిర్వహణలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ నాటకోత్సవాలు ప్రతిరోజు సాయంత్రం 6 .00 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే….ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.
నాటకాల వివరాలు :
జులై 4 సాయంత్రం 6 .00 గంటలకు – ఎవరికి చుట్టాలు
జులై 4 సాయంత్రం 7 .00 గంటలకు – కండీషన్స్ అప్లై
జులై 5 సాయంత్రం 6 .00 గంటలకు – బిచ్చగాడు
జులై 5 సాయంత్రం 7 .00 గంటలకు – ఎలుగుబంటు- ఎలుక ముఖం
జులై 5 సాయంత్రం 8 .00 గంటలకు – దిక్సూచి
జులై 6 సాయంత్రం 6 .00 గంటలకు – పుష్పలత నవ్వింది
జులై 6 సాయంత్రం 7 .00 గంటలకు – ఇక్కడ పెళ్లిళ్లు చేయించబడును
జులై 6 సాయంత్రం 8 .00 గంటలకు – శుభలగ్నం
జులై 7 సాయంత్రం 6 .00 గంటలకు – ఖతర్నాక్ మల్లన్న
జులై 7 సాయంత్రం 7 .00 గంటలకు – మేరె ప్యారే పతంగ్