తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 120మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లలో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పొలింగ్ జరుగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందొబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. దొంగ ఓట్లను అరికట్టడానికి దేశంలోనే మొదటిసారిగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను అధికారులు వినియోగిస్తున్నారు.
పోలింగ్ కోసం 44 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. 1240 మంది ఎన్నికల పరిశీలకులు కూడా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక నేడు మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఈ నెల 24 కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 58 డివిజన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి.