- Advertisement -
అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం…మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి మధ్య ఉన్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ లుంబినీ పార్క్ బీఆర్కే ఆర్ భవన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తెలంగాణ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ల్యాండ్ స్కేప్ పార్క్ సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకే చోట పరిపాలన భవనం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి, లుంబినీ పార్క్, ల్యాండ్ స్కేప్ లాంటి దర్శనీయ ప్రదేశాల నడుమ తెలంగాణ విగ్రహాంను ఏర్పాటు చేయనున్నారు.
Also Read: KTR:రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా..?
- Advertisement -