- Advertisement -
రాష్ట్రంలో రెండు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సాయంత్రం 4 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం పోలింగ్ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసేసరికి రెండు స్థానాల్లోనూ పోలింగ్ 50 శాతానికి మించే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని వారు చెబుతున్నారు.
- Advertisement -