మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..

144
- Advertisement -

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార వైసీపీకే ప్రజలు పట్టం కట్టినట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. టీడీపీ అనేక చోట్ల ఉనికి చాటుకున్నా, వైసీపీ ప్రభంజనం ముందు అది చాలా స్వల్పం అని చెప్పాలి. జనసేన పార్టీ పలు ప్రాంతాల్లో విజయాలు సాధించడం ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు..

-తిరుపతి (50)- వైసీపీ 47, టీడీపీ 1
-కడప (50)- వైసీపీ 27… ఇతర పార్టీలు ఇంకా బోణీ చేయలేదు.
-కర్నూలు (52)- వైసీపీ 41, టీడీపీ 8, ఇతరులు 3
-అనంతపురం (50)- వైసీపీ 48, ఇతరులు 2
-విజయనగరం (50)- వైసీపీ 24, టీడీపీ 1
-మచిలీపట్నం (50)- వైసీపీ 14, టీడీపీ 2, జనసేన 1
-విజయవాడ (64)-వైసీపీ 23, టీడీపీ 10
-గుంటూరు (57)-వైసీపీ 44, టీడీపీ 9, జనసేన 2
-విశాఖపట్నం (98)-వైసీపీ 58, టీడీపీ 30, జనసేన 4, ఇతరులు 6
-ఒంగోలు (50)- వైసీపీ 41, టీడీపీ 6, జనసేన 1, ఇతరులు 2
-చిత్తూరు (50)- వైసీపీ 46, టీడీపీ 3, ఇతరులు 1

- Advertisement -