ఘంటా చక్రపాణిని పరామర్శించిన మంత్రులు…

66
ganta

టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని పరామర్శించారు మంత్రులు. చక్రపాణి మాతృమూర్తి జననమ్మ (85) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం చక్రపాణి స్వగ్రామం కరీంనగర్ జిల్లా మల్కాపూర్‌లో జననమ్మ దశదిన కర్మ నిర్వహించగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, కరీంనగర్‌ మేయర్ సునిల్ రావు తదితరులు హాజరై జననమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జననమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చక్రపాణితోపాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.