15రోజుల్లో..బన్సీలాల్‌పేట మెట్లబావి పూర్తి

210
- Advertisement -

ఆలనాటి తెలంగాణ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం మెట్లబావి. ఆనాటి రాజులు మంచినీటి కోసం అనేక రకాల మార్గాలను వెతికారు. చెరువులు తవ్వించడం, బావులను తవ్వించడం, నదులకు ఆనకట్టలు నిర్మించి పొదుపుగా నీటిని వాడుకునే మార్గాలను చూపెట్టి భావి భారత పౌరులకు మార్గదర్శకులుగా నిలిచారు.

హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్‌ పేట మెట్లబావి పునరుద్దరణ పనులను 15రోజుల్లో పూర్తిచేయాలని మంత్రి తలసాని అధికారులకు అదేశించారు. బన్సీలాల్‌పేట బావిని ఈ నెలాఖరు లోపు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నారు. మున్సిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో కలిసి మెట్లబావి పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మెట్లబావితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దీనిని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తద్వారా ఇక్కడివారికి ఉపాధి కల్పిస్తామన్నారు. మెట్లబావి పునరుద్ధరణతో నీటి సమస్య తీరుతుందన్నారు.

ఇవి కూడా చదవండి..

గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన ధ్రువన్

మోదీ కలవనున్న జనసేనాని

టీమిండియా..దృశ్యం సినిమాకు లింక్

- Advertisement -