తెలంగాణ భ‌వ‌న్ క‌ళ‌క‌ళ‌లాడుతోంది; మంత్రి కేటీఆర్

286
ktr
- Advertisement -

ఇత‌ర పార్టీల నుంచి ప్ర‌తిరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతుంటే తెలంగాణ భ‌వ‌న్ క‌ళ‌క‌ళలాడుతుంద‌న్నారు మంత్రి కేటీఆర్. కేటీఆర్ సమక్షంలో జగిత్యాల ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ లక్ష్మణ్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ తిరుమలరావు, బీజేపీ కిసాన్ మోర్చు రాష్ట్ర కార్యదర్శి తిరుపతిరెడ్డిలు పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ కళకళలాడుతుంటే.. గాంధీభవన్ మాత్రం ఆందోళనలతో అట్టుడుకుతోందన్నారు. గాంధీభ‌వ‌న్ లో దాడులు జ‌ర‌గ‌కుండా బౌన్స‌ర్స‌తో, ప్రైవేటు సెక్యూరీటిని పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు.

min ktr

2014ఎన్నిక‌లలో క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని మొత్తం 13అసెంబ్లీ స్ధానాల‌కు 12 అసెంబ్లీ స్ధానాలు సాధించిన ఘ‌న‌త టీఆర్ఎస్ పార్టీకే ద‌క్కుతుంద‌న్నారు. ఈసారి మాత్రం అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చొప్ప‌దండి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి ర‌విశంక‌ర్ ను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాల‌న్నారు.

ktr

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది ప‌థం వైపు న‌డుస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాలను దేశంలో ఉన్న నాయ‌కులంద‌రూ మెచ్చుకుంటుంటే మ‌న రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయ‌కులు మాత్రం విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. తెలంగాణలో అభివృద్ది జ‌ర‌గాలంటే కేసీఆర్ మ‌రో సారి ముఖ్య‌మంత్రి కావాల‌న్నారు. క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ను సీఎం చేయాల‌ని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -