సీఎం కేసీఆర్‌ ఫోటో మీరు పెట్టండి హరీశ్‌రావు

130
harish rao
- Advertisement -

రేషన్‌ దుకాణంలో ప్రధాని మోదీ ఫోటో ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అనడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ పమంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఆమె ప్రవర్తించారని మండిపడ్డారు.

మెదక్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు …కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని అన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి డబ్బులు ఇస్తున్నాం. రాష్ట్రం నుంచి రూ.3,65,795కోట్ల పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. కేంద్రానికి రాష్ట్రం ననుంచి వెళ్లే సొమ్ము ఎక్కువ.. కేంద్రం నుంచి వచ్చేది మాత్రం తక్కువన్నారు. మాకు కులం లేదు, మతం లేదు. పేదలందరికీ భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో కూర్చున్న వారు కాళేశ్వరం మీద విమర్శలు చేస్తరు. భూమికి బరువయ్యే పంట పండుతుంది.

కేంద్రాన్ని కొన్ని రాష్ట్రాలను సాకడంలో తెలంగాణ ప్రభుత్వం వాటా ఉంది. రాష్ట్ర ప్రజల సంపద ఉందన్నారు. మరి ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ ప్రతినిధి సీఎం కేసీఆర్‌ ఫోటో మీరు పెట్టండి. మీరు అలా మాట్లాడితే మేమూ మాట్లాడగలం మీరు మాట్లాడే మాటల్నీ అసత్యాలు ఆర్థసత్యాలు మేం మాట్లాడేవి నగ్న సత్యాలు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పెద్దలు అబద్ధాలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. పట్టపగలు వచ్చి అబద్ధాలు మాట్లాడే పార్టీ బీజేపీ అని హరీశ్‌రావు విమర్శించారు.

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని సొసైటీ కార్యాలయంలో రేషన్‌ దుకాణాన్ని శుక్రవారం నిర్మలా సీతారామన్‌ పరిశీలించారు. రేషన్‌ దుకాణంలో లబ్ధిదారులు కార్డుల సంఖ్య బియ్యం నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేషన్‌ లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో 2020 మార్చి నుంచి ఉచిత బియ్యాన్ని కేంద్రం పంపిణీ చేస్తోందని..రవాణా, గోదాం, ఖర్చులను భరించి ప్రజలకు బియ్యాన్ని ఇస్తున్నప్పుడు రేషన్‌ దుకాణంలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడమేంటని కేంద్రమంత్రి అసహనం వ్యక్తం చేశారు. మరోసారి తాను వచ్చేటప్పటికి ప్రధాని ఫోటో ఉండాలని కలెక్టర్‌ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో హరీశ్‌ స్పందించారు.

- Advertisement -