ముప్పై నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన మంత్రి..

61
minister Koppula

ముప్పై నిమిషాల పాటు లిఫ్ట్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇరుక్కుపోయారు. సైఫాబాద్ లోని ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్. కార్యక్రమం ముగించుకొని లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా మధ్యలో లిఫ్ట్ నిలిచిపోయింది. దీంతో మంత్రిని లిఫ్ట్‌లో నుండి బయటకు తీసుకొచ్చేందుకు ముప్పై నిమిషాల పాటు సిబ్బంది శ్రమించారు. ఎట్టకేలకు లిఫ్ట్ లాక్ ఓపెన్ చేసి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సహాయ సిబ్బంది.