మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్..

164
puvvada ajay
- Advertisement -

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో వైకుంఠధామం ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్, యం.ఎల్.సి బాలసాని, డి.సి.సి.బి ఛైర్మెన్ కూరాకుల నాగభూషణం, డి.సి.యం.ఎస్ ఛైర్మెన్ రాయల శేషగిరిరావు లు పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. సిఎం కె.సి.ఆర్ ముందు చూపుతో నాగార్జున సాగర్ నీటి నిల్వలు ఉంచి ముందుగా నీళ్లు వదిలి పంట ముందుగా వేసుకునేలా ప్లాన్ చేసారు. ఖమ్మం జిల్లాలో వరి ఎక్కువగా పండించేది సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలు. సత్తుపల్లి నియోజకవర్గం నుండి 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది అని అంచనా ఉంది. పూర్తి స్థాయిలో మద్దతుధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు..

బస్తాలకు ఎటువంటి ఇబ్బంది లేదు, రవాణాకు ఇబ్బందులు లేకుండా లోకల్ మిల్లు లను తీసుకున్నాం. సత్తుపల్లిలో 450కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంది. రైతులకు మేము చెప్పే విన్నపం ఒక్కటే తేమశాతం తగినంత ఉన్నప్పుడు మాత్రమే కాటా వేస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అని మనవి చేసుకుంటున్నా అని మంత్రి అన్నారు. మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అయినా కానీ మరొక 100రూపాయలు తెలంగాణ ప్రభుత్వం తరుపున రైతాంగానికి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

ఏ రాష్ట్రంలో కూడా రైతులు కూర్చోవటానికి ఒక వేధిక లేదు, ఏ రాష్ట్రంలో కూడా పల్లె ప్రకృతి వనం లేదు, ఏ రాష్ట్రంలో కూడా 100% వైకుంఠదామాలు లేవు, ఏ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామ పంచాయితీకి ట్రాక్టర్లు లేవు, దేశంలో ఇవన్నీ ఉన్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని మంత్రి అన్నారు. భారత దేశంలో అతి చిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రంలో 100% త్రాగు నీటిని సరఫరా చేస్తూ దేశంలో మొదటి స్థానంలో ఉంది. వచ్చే రెండు నెలలు రైతులు సెల్ ఫోన్లు పట్టుకు కూర్చోవాలి, ధాన్యం డబ్బులు, తర్వాత రైతు బంధు మీ ఖాతాలలో జమ అవుతాయని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు.

- Advertisement -