KTR:పారిశ్రామిక రంగంలో తెలంగాణ మేటీ

44
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో పరిశ్రమల శాఖ అభివృద్ధి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. ఒక్క పెట్టుబడిని రాష్ట్రానికి తేవాలంటే ఎంతగానో కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. టీ హబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు సాధ్యమైనన్నని ఎక్కువ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తపనే మమ్మల్ని వివిధ పర్యటనలో కష్టపడేలా చేసిందన్నారు.

2014లో రాష్ట్ర జీఎస్డీపీలో 5లక్షల కోట్ల నుంచి 13.27లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ 57వేల కోట్ల నుంచి 2.40లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. తెలంగాణ అంటే సమగ్ర సమ్మిళిత సమీకృత సమతుల్య మోడల్‌ అని అన్నారు. తెలంగాణ పారిశ్రామిక రంగం నుంచి వ్యవసాయం రంగం దాకా అన్ని రంగాల్లోనూ తెలంగాణ తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఉపాధి అవకాశాలు వచ్చేలా పనిచేసిన మా పరిశ్రమల శాఖ బృందంలోని ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తొలిసారి 2014లో ఇన్నోవేషన్‌ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. దాని ఫలితమే ఈ రోజు దేశంలోనే అతిపెద్ద టీహబ్ టీ వర్క్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలోనే0 అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ పార్క్ కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచంలోనే సింగిల్ లార్జెస్ట్‌ ఫార్మా క్లస్టర్ హైదరాబాద్‌ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దేశంలోనే అతి పెద్ద మెడికలల్ డివైసిస్ పార్క్‌ను సుల్తాన్ పూర్‌లో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రపంచంలో అత్యంత చౌవకైన స్టెంట్‌ మ్యానుఫ్యాక్చరింగ్ తయార యూనిట్ తెలంగాణలోనే ఉందన్నారు. వ్యాక్సిన్ క్యాపిటల్‌ ఆఫ్ వరల్డ్‌గా తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు.

Also Read: CMKCR:బీఆర్ఎస్‌ హెచ్‌ఆర్‌డీ కార్యాలయం శంకుస్థాపన

జినోం వ్యాలీలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగ ప్రగతికి ఎంతగానో దొహదపడుతుందన్నారు. ఐటీ రంగంలో 3.23 లక్షల మంది ఉద్యోగులు ఉండగా నేడు 9.5లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని ఇది దాదాపుగా మూడు రెట్లు పెరిగిందన్నారు. విద్యా వైద్యం సాగునీరు తాగునీరు పర్యావరణం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణకు జాతీయ స్థాయిలో వివిధ అవార్డులు ప్రశంసలు వచ్చాయన్నారు. తెలంగాణ సాధించిన పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి పట్ల ఒక మంత్రిగా తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా భారతీయుడిగా గర్వపడుతున్న అని అన్నారు.

Also Read: నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్..

- Advertisement -