కంటివెలుగు దేశవ్యాప్తంగా విస్తరణ..

23
- Advertisement -

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని రైతు వేదిక సెంటర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌ సభకు వచ్చిన మూడు రాష్ట్రాల సీఎంలు కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతగొప్ప కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తరించడం…తెలంగాణ ప్రభుత్వ ఖ్యాతి పొందిందన్నారు.

దేశప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్నారని చైర్మన్‌ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు కంటివెలుగు కార్యక్రమలో అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. వందరోజుల్లో తెలంగాణ ప్రజలకు కంటివెలుగు పరీక్షలు నిర్వహించి గిన్నీస్‌ బుక్‌ రికార్డ్‌ సాధించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

తెలంగాణ రాష్టంలో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, రాష్ట్ర అగ్రోస్ సంస్థ చైర్మన్ విజయసింహరెడ్డి, ఆడిషనల్ కలెక్టర్ ఖుష్భూ గుప్తా తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

ప్రజలు కోరిన చోట శిబిరాలు:హరీశ్‌

ఖమ్మం జిల్లాకు వరాల్లు:సీఎం

కేంద్రం సహకరించకున్నా తెలంగాణ టాప్‌..

- Advertisement -