లాక్ డౌన్…బ్యాంక్ టైమింగ్స్ చేంజ్

82
sbi

రాష్ట్రంలో కఠినంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర,బ్యాంకు,ఫార్మా తదితర రంగాలకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇవ్వగా తాజాగా బ్యాంకుల టైమింగ్స్ చేంజ్ అయ్యాయి.

కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో గురువారం నుంచి మార్పు చోటు చేసుకోనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.కేవలం 50 శాతం మంది సిబ్బంది మాత్రమే విధులకు హాజరుకానున్నారు.

ఈ నెల 20 వరకు కేవలం 4 గంటలు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.