కరోనాతో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ తండ్రి కన్నుమూత…

98
rp singh

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ కరోనా వైరస్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆర్పీ సింగ్.. నా తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ కన్నుమూసిన విషయాన్ని తీవ్ర దు:ఖంతో తెలియజేస్తున్నాను. కొవిడ్‌తో

బాధపడుతూనే మే 12న మమ్మల్ని వదిలివెళ్లిపోయారు. నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరేలా మీరంతా ఆ దేవుణ్ని ప్రార్థించాలని కోరుతున్నా. ఆర్‌ఐపీ పాపా’ అంటూ సింగ్‌ ట్వీట్‌ చేశాడు.

2018లో ఆర్పీ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు ఆర్పీ సింగ్. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు, 10 టీ20ల్లో 15 వికెట్లు తీశాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియాలో ఆర్పీ సింగ్‌ సభ్యుడిగా ఉన్నాడు.