ముగిసిన తెలంగాణ‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్..

138
- Advertisement -

తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు పోలింగ్ ముగిసింది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల్లో ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప‌లు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ న‌మోదైంది. మొత్తంగా పోలింగ్ ముగిసే స‌మ‌యానికి 90 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైన‌ట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్ జ‌రిగింది. పోలింగ్‌ ప్రక్రి‌యను వెబ్‌‌క్యా‌స్టింగ్ చేశారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.

ఖమ్మం జిల్లా:

ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.
నాలుగు గంటల వరకు పోలైన ఓట్ల వివరాలు

ఖమ్మం…
మొత్తం ఓట్లు…348
పోలైన ఓట్లు…336,

కల్లూరు…
మొత్తం ఓట్లు…115
పోలైన ఓట్లు…114

కొత్తగూడెం…
మొత్తం ఓట్లు…221
పోలైన ఓట్లు…209

భద్రాచలం….
మొత్తం ఓట్లు…84
పోలైన ఓట్లు…79

ఖమ్మం జిల్లా లో
మొత్తం ఓట్లు…768
పోలైన ఓట్లు…738

- Advertisement -