PUSHPA:సిండికేట్ పుష్ప ఎక్కడ..?

52
- Advertisement -

అల్లుఅర్జున్ సినీ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ ఉందంటే అది ఖచ్చితంగా పుష్ప అయి వుంటుంది. సుకుమార్ బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన రెండవ సినిమాయే ఈ పుష్ప. గతేడాది విడుదలై దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పుష్ప  ఒక సినిమా సెట్టర్‌గా పలువురు సినీ క్రిటీక్ వివరిస్తున్నారు. తాజాగా పుష్ప-2పై టాలీవుడ్‌తో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే యేడాది మార్చిలో విడుదల చేయాలని మూవీ మేకర్స్‌ భావిస్తున్నారు.

అయితే తాజాగా ఏప్రిల్‌ 7న బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప ది రూల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పుష్ప-2 గ్లింప్స్ తో సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. తొలిపార్టుకు మించి ఉండబోతుందని గతంలోనే తెలిపిన దర్శకుడు..దానికి తగ్గట్టుగానే సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. మైత్రీ సంస్థ నిర్మిస్తున్ ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. సునీల్ అనసూయ భరద్వాజ్ మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే రష్మిక బర్త్‌డే సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను అన్ని భాషలకు కలుపుకొని డిజిటల్‌ రైట్స్‌ కోసం రూ.200కోట్లు ఆఫర్ చేసినట్టు టాలీవుడ్‌లో టాక్‌. మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి..!

ఇవి కూడా చదవండి…

జిలేబి ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ : వెంకటేష్

BALAGAM:బలగం కి మరో ఇంటర్నేషనల్ అవార్డ్

జాన్‌సేనతో ప్రియాంక మూవీ..!

- Advertisement -