- Advertisement -
అక్టోబర్ 8న ఖతర్‌లో మహాబతుకమ్మ వేడుకలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఏ గడ్డపై ఉన్నా, ఎన్ని ఇబ్బందులెదురైనా స్వీయ సంస్కృతిపై మక్కువతో, మాతృభూమిపై మమకారంతో మన సంస్కృతిని, పండుగలను జరుపుకుంటున్న ప్రవాస తెలంగాణ వాసుల కృషిని ఆమె కొనియాడారు.
దోహలోని ఐసీసీ అశోక హాల్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నట్లు తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షుడు నందిని అబ్బగౌని తెలిపారు. కరోనా నిబంధనల మేరకు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ ఆచారి, జాగృతి ఖతర్ కార్యవర్గ సభ్యులు స్వప్నా కేశా, శ్రీధర్ అబ్బగౌని, అభిలాష్ బండి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -