సంపద సృష్టిస్తాం…పేదలకు పంచుతాం: తలసాని

31
talasani

సంపద సృష్టించాలి…. పేదలకు పంచాలి ఇదీ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ లో చేప పిల్లలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని…ధ్వంసమైన కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషిచేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శం అన్నారు. మత్స్యకారుల సంక్షేమానికే ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టామన్నారు.

ఈ సంవత్సరం 115 కోట్ల వ్యయంతో 93 కోట్ల చేప, 25 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేశామన్నారు. రూ. 800 కోట్ల రూపాయల ఖర్చుతో మత్స్యకారులకు వివిధ వాహనాలు అందజేశామన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు.