ఐస్‌ క్రీం అడ్డా తెలంగాణ..కేటీఆర్ ట్వీట్‌

328
- Advertisement -

తెలంగాణ ఐస్‌ క్రీం అడ్డాగా మారబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం కంపెనీని జహీరాబాద్‌లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ట్వీట్టర్‌ ద్వారా స్పందిస్తూ ఇది నాకు ఎంతగానో గర్వంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ఫ్యాక్టరీ స్థాపించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక మీద తెలంగాణ ఐస్‌ క్రీం అడ్డాగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హ‌ట్స‌న్ కంపెనీ ద్వారా రోజుకు 7 ట‌న్నుల చాకోలెట్స్, 100 ట‌న్నుల ఐస్‌క్రీంను ప్రాసెస్ చేసే ప్లాంట్ల ప్రారంభోత్స‌వం సంతోషాన్నిస్తుంద‌న్నారు. ప్ర‌సిద్ధి గాంచిన‌ అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జ‌హీరాబాద్‌లో ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు తెలిపారు.

తెలంగాణలో జ‌రుగుతున్న శ్వేత విప్ల‌వానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ఈ యూనిట్ ప్ర‌తి రోజు 10 ల‌క్ష‌ల లీట‌ర్ల పాల‌ను కొనుగోలు చేస్తుంద‌ని, దీని వ‌ల్ల 5 వేల మంది పాడి రైతులు లాభం పొందుతున్నార‌ని తెలిపారు. 1500 మందికి ఉపాధి కూడా ల‌భిస్తుంద‌ని కేటీఆర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

పాండ్యా కోసం కిచిడి మాస్టార్..

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు..

తెలంగాణకు భారీగా వలసలు

- Advertisement -