ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు..

29

తెలంగాణలో మంత్రివర్గ నిర్ణయం మేరకు ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల దగ్గర ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం నిర్ధిష్ట నిర్వహణా విధానాన్ని అనుసరించనున్నది ప్రభుత్వం. అమ్మే భూములకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అమ్మకానికి పెట్టిన భూములను మల్టీపర్పస్ జోన్ గా ప్రకటించాలన్న ప్రభుత్వం వెల్లడించింది. ఈ-వేలం ద్వారా పారదర్శకంగా భూముల విక్రయం చేపట్టనున్నది ప్రభుత్వం. కొనుగోలుదార్లకు అవసరమైన అన్ని రకాల అనుమతులు ఇవ్వనుంది. భూముల విక్రయం కోసం వివిధ కమిటీల ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
-న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ
-అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ
-భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీ
-భూమి ధరను నిర్ణయించి ఈ-వేలం ప్రక్రియ నిర్వహించనున్నది నోడల్ విభాగం.