KTR:తెలంగాణ దేశానికే రోల్ మోడల్

43
- Advertisement -

దేశంలో ఈ కామర్స్ రంగం దూసుకెళ్తుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫిల్‌మెంట్‌ సెంటర్ను వర్ఛువల్ విధానంలో మంగళవారం ప్రారంభించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఫ్లిప్ కార్ట్ సీఈవో కళ్యణ్‌తో పాటు పలువురు హాజరయ్యారు.

Also Read: బీజేపీ మేనిఫెస్టో.. గట్టెక్కిస్తుందా ?

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేసినందుకు ఆ యాజ‌మాన్యానికి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 40 వేల మందికి ఉపాధి క‌ల్ప‌న ల‌భిస్తుంద‌ని తెలిపారు. తెలంగాణ ఏంచేస్తే దేశం అదే ఫాలో అవుతుందన్నారు. రాష్ట్రంలో మహిళ స్వయం సహాయక బృందాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఉపాధి కల్పనలో మహిళలకు 50శాతం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. తెలంగాణను దేశానికి రోల్‌ మాడల్‌గా నిలిచిందన్నారు.

Also Read: ఏపీకి కే‌సి‌ఆరే దిక్కు !

- Advertisement -