దేశానికే రోల్ మోడల్‌గా సీఎం కేసీఆర్ పాలన: తలసాని

93
talasani

సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ గా పాలిస్తున్నారని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని…కరోనా సమయం లోనూ సంక్షేమాన్ని ఆపలేదు …సంక్షేమం ఆగడం లేదు ..సచివాలయ నిర్మాణం కూడా ఆగదు …కెసిఆర్ కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన్నారు.

కొత్త సచివాలయాన్ని కూల్చి వేస్తామని అంటే చూస్తూ ఊరుకుంటామా ?…దేశానికే తలమానికం గా కొత్త సచిఆలయాన్ని నిర్మిస్తాం …సచివాలయం నిర్మాణం తెలంగాణ ప్రజలకు సంబంధించింది ..కేవలం టి ఆర్ ఎస్ కు సంబంధించిన వ్యవహారం కాదు …ఢిల్లీ లో కొత్త పార్లమెంటు కట్టాలనుకోవడం లేదా ?అది తప్పా ? …బీజేపీ దిక్కు మాలిన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు తలసాని.మత రాజకీయాలు తప్ప బీజేపీ కి ఏం చేత కాదన్నారు.