CMKCR:దేశంలోనే నెంబర్‌ వన్ తెలంగాణ

49
- Advertisement -

చిన్న రాష్ట్రమైన తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ..కేంద్రం నుంచి అనేక అవార్డులను అందుకుంటున్న ఏకైక రాష్ట్రమని అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభించుకున్న అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్ శిలా ఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అంతకుముందు గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. మనందరం చేసిన పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. పరిపాలన సంస్కరనల కోసం నూతన కలెక్టరేట్లను నిర్మించుకుంటున్నామని తెలిపారు. సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ప్రజలకు మంచి జరగాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. త్వరలోనే ఆసిఫాబాద్ కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించుకోబోతున్నట్టు తెలిపారు.

Also Read: “ఆపరేషన్.. అపోజిషన్ ” కే‌సి‌ఆర్ వ్యూహం!

తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో టాప్‌లో ఉందన్నారు. కులమతాలకు అతీతంగా అందరి సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఎన్నో విషయాల్లో నంబర్ వన్‌గా ఉన్నామని అన్నారు. మానవీయ కోణంల సంక్షేమ పథకాను అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తున్న అధికారులకు అభినందనలు తెలిపారు.

Also Read: బీసీల్లోని వృత్తికులాలకు ఆర్థికసాయం..

- Advertisement -