తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

11
- Advertisement -

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషషనర్‌గా టీకే శ్రీదేవి ,వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌,రవాణా, ఆర్‌అండ్‌బీ సంయుక్త కార్యదర్శిగా ఎస్‌.హరీశ్‌,మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించారు .

పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక,హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి,మార్క్‌ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డిలను బదిలీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 12 రోజుల పాటు అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో బదిలీలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన హెటిరో డైరెక్టర్

- Advertisement -