నిరుద్యోగులకు తీపి కబురు : తెలంగాణ హైకోర్టు

48
highcourt
- Advertisement -

నిరుద్యోగులకు తీపి కబురు తెలంగాణ హైకోర్టు తెలిపింది. 65 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ రిలీజ్‌ చేసింది. జ‌డ్జిలు, రిజిస్ట్రార్ల ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీలు, కోర్టు మాస్ట‌ర్ల పోస్టుల‌ను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఈ మేర‌కు 65 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు తెలిపింది. దేశంలోని ఏ యూనివ‌ర్సిటీ నుంచైనా డిగ్రీ లేదా లా విద్య‌ను అభ్య‌సించిన వారంద‌రూ ఈ పోస్టుల‌కు అర్హులే అని ప్ర‌క‌టించింది.

ద‌ర‌ఖాస్తు దారుల‌కు 2022, జులై 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి. 34 ఏండ్ల వ‌య‌సు మించ‌రాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరికి చెందిన అభ్య‌ర్థుల‌కు వ‌యో ప‌రిమితి సడలింపు ఇచ్చారు. ఓసీ, బీసీ కేట‌గిరిల వారు రూ. 800 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరి అభ్య‌ర్థులు రూ. 400 చెల్లించాలి. డీడీల‌ను ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్‌), తెలంగాణ హైకోర్టు పేరిట తీయాలి. ద‌ర‌ఖాస్తుల‌ను స్పీడ్ పోస్టు లేదా కొరియ‌ర్ ద్వారా జులై 22న సాయంత్రం 5 గంట‌ల్లోపు తెలంగాణ హైకోర్టుకు పంపాలి.

- Advertisement -