విగ్రహాల తయారీ కాదు..నిమజ్జనంపై సమస్య : హైకోర్టు

87
highcourt
- Advertisement -

వినాయక విగ్రహాల తయారీ నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ) విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలను పోల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ) నిషేధం ఇవ్వాలని గతంలో జారీ చేసిందని కాని ఇంతవరకు ప్రభుత్వం దీనిపై ఏవిధంగా స్పందించలేదన్నారు. కావున వినాయక విగ్రహాల తయారీ కాక, నిమజ్జనంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో వాటిని నిమజ్జనం చేయాలని చేప్పింది. పీసీబీ మార్గదర్శకాలను సవాల్‌ చేస్తూ వినాయక విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనాకు ముందు విగ్రహాలను తయారు చేశామని కనీసం వాటినైనా అమ్ముకునెందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు… ఇందులో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. హైదరాబాద్‌లో నదులు,చెరువులు తక్కువగా ఉన్నందున్న సమస్య తలెత్తుతుందని కోర్టు అభిప్రాయపడింది. బెంగాల్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా తీసుకునే మార్గదర్శకాలను పరిశీలించాలని సూచించింది.

- Advertisement -