తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేసింది హైకోర్టు. వాళ్ల డబ్బులు వాళ్లకు ఇవ్వడానికి ఎందుకింత నిర్లక్ష్యం? ,జూన్ 10వ తేదీ లోపు బెనిఫిట్స్ రాలేదని ఒక్క రిటైర్డ్ ఉద్యోగి కూడా చెప్పకూడదు అని ఆదేశించింది.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో ఆర్థిక శాఖ నిర్లక్ష్యం తగదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తమ బెనిఫిట్స్ ఇవ్వడంలేదని, రిటైర్డ్ ఉద్యోగులు వేసిన 754 పిటిషన్ల పట్ల విచారణ జరిపింది తెలంగాణ హైకోర్టు.
ఒక్కో పిటీషన్లో దాదాపు ఒకటి నుండి 10 మంది పిటిషనర్లు ఉన్నారని, ఒక్కో పిటీషన్లో ఎంత మందికి బెనిఫిట్స్ ఇచ్చారో పూర్తి నివేదిక అందజేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని, వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించింది.
Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం
జూన్ 10వ తేదీకి కేసు వాయిదా వేస్తూ, ఆ లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని, తదుపరి విచారణలోగా ఒక్క పిటిషనర్ కూడా బెనిఫిట్స్ రాలేదని చెప్పకూడదని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.

