నటి రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంది. ఈ నెల 5న జరిగిన తన బర్త్‌డే వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆమె తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.
ఈసారి తన పుట్టినరోజును రష్మిక తన స్వస్థలమైన వీర్జపేట్‌లో జరుపుకోవడం విశేషం. కుటుంబ సభ్యులతో పాటు అత్తమామల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు ఎంతో ఆత్మీయంగా సాగాయి. నగరపు హడావిడి దూరంగా, పుట్టింటి వాతావరణంలో జరుపుకున్న ఈ బర్త్‌డే ఆమెకు మరింత స్పెషల్‌గా మారింది.
ఈ వేడుకల్లో రష్మికతో పాటు ఆమె భర్త విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేస్తూ, సరదాగా గడిపిన క్షణాలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు అభిమానుల్లో విపరీతమైన స్పందనను తెచ్చుకున్నాయి.
తన చిన్నప్పటి స్కూల్ వద్ద ఫోటోలు దిగుతూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది రష్మిక. చిన్నతనం గడిపిన ఆ ప్రదేశాలను తిరిగి చూసి ఆమె భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. అభిమానులతో పంచుకున్న ఈ జ్ఞాపకాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం


