వారం రోజుల పాటు భారీ వర్షాలు!

3
- Advertisement -

నేటి నుంచి తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఇది మరింత బలపడితే ఆగస్టు 5 తరువాత తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

Also Read:‘సు ఫ్రమ్ సో’..రిలీజ్ డేట్

ఇటీవలె తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

- Advertisement -