వివాదం తేలేదాకా ఆగలేరా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. భూములు అక్కడే ఉంటాయి కదా?..విచారణకు హైడ్రా కమిషనర్ ఎందుకు హాజరుకాలేదు? చెప్పాలని ప్రశ్నించింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని సూరారంలో ఉన్న సర్వే నంబర్ 105 లోని ప్రైవేట్ భూమి వివాదంలో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులు 48 గంటల్లో తొలగించాలని మే 6వ తేదీన ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు న్యాయమూర్తి.
హైడ్రా హైకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన పిటిషన్ విచారిస్తూ రంగనాథ్‌పై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్. కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని, భూమి ఎక్కడైనా వెళ్తుందా, వివాదం ముగిసేదాకా ఆగకుండా బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటని హైకోర్టు మండిపడింది.
Also Read:రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేశా!
ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలని చెప్పినా హాజరు కాలేదని, మినహాయింపు కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అయ్యేందుకు ప్రయత్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింద. ఇలాగే కొనసాగితే హైడ్రా కమిషనర్ కెరీర్ ఇరకాటంలో పడే ప్రమాదం ఉందని హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది.

