పంచాయతీ ఎన్నికలు.. విడ‌త‌ల వారిగా వివ‌రాలు

215
Gram Panchayat Election

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ తాజాగా విడుదల అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఈ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

తొలి విడత ఎన్నికలు- జనవరి 7న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు.
7 నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ.
10న నామినేషన్ల పరిశీలన.
11న ఆర్డీవోలకు అప్పీలు చేసేందుకు అవకాశం.
12న ఆర్డీవోలచే అప్పీల పరిష్కారం.
13న నామినేషన్ల ఉపసంహరణ.
21 పోలింగ్, ఓట్ల లెక్కింపు.

రెండో విడత ఎన్నికలు- జనవరి 11న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు.
11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ.
14న నామినేషన్ల పరిశీలన.
15న ఆర్డీవోలకు అప్పీలు చేసేందుకు అవకాశం.
16న ఆర్డీవోలచే అప్పీల పరిష్కారం.
17న నామినేషన్ల ఉపసంహరణ.
25న పోలింగ్, ఓట్ల లెక్కింపు.

మూడో విడత ఎన్నికలు- జనవరి 16న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు.
16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ.
19న నామినేషన్ల పరిశీలన.
20న ఆర్డీవోలకు అప్పీలు చేసేందుకు అవకాశం.
21న ఆర్డీవోలచే అప్పీల పరిష్కారం.
22న నామినేషన్ల ఉపసంహరణ.
30 పోలింగ్, ఓట్ల లెక్కింపు.