నేటి నుంచి రైతుబంధు

74
- Advertisement -

రైతు సంక్షేమమే ద్యేయంగా కొనసాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌…పదోవిడత రైతు బంధు నేటి నుంచి  రైతుల ఖాతాల్లో జమ కానుంది. రాష్ట్రంలోని 70.54లక్షల మంది రైతులకు యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రూ.7,676.61కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది.

ఎకరానికి రూ.5వేల చోప్పున కోటి 53లక్షల53వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు సాయం అందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ దఫా రైతు బంధుతో కలిపి మొత్తం ఇప్పటివరకు మొత్తం రూ.65,559.28కోట్లు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేశామని తెలిపారు.

అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా చివరి రైతు వరకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు పెట్టుబడి సాయం పంపిణీపై పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన వ్యాపారవేత్త రాజేశ్వర్‌

పచ్చి గుడ్డు తింటున్నారా.. జాగ్రత్త!

మొక్కలు నాటిన షాబాద్‌ జెడ్పీటీసీ…

- Advertisement -