వాల్తేరు వీరయ్య పై చిరు ముచ్చట్లు

30
- Advertisement -

మాస్ మహారాజ రవితేజ, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలోని ప్రధానమైన సెట్ లో రొటీన్ కి భిన్నంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఈ సినిమా గురించి బోలెడు విషయాలు చెప్పారు. మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి మీరు ఎంత ఊహించుకున్నా అంతకుమించే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో చేసిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అంటూ చిరు చెప్పుకొచ్చారు.

అయితే, ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్ మీట్ లో రవితేజ గురించి మెగాస్టార్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో రవితేజ గురించి తాను ప్రెస్ మీట్ లో ఏం, చెప్పకపోవడంపై చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. “సినిమాపై క్లుప్తంగా మాట్లాడాలనుకోవడంతో నా తమ్ముడు, వీరయ్యకు అతిముఖ్యుడైన రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. షూటింగ్ లో ప్రతి రోజు రవితో మళ్లీ ఇన్నేళ్లకు చేయటం నాకెంతో ఆనందంగా అనిపించింది. అలాగే తను చెయకపోయుంటే ‘వాల్తేరు వీరయ్య’ అసంపూర్ణంగా ఉండేది” అంటూ ఆసక్తికర మెగాస్టార్ వ్యాఖ్యలు చేశారు.

‘వాల్తేరు వీరయ్య’కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి మెగాస్టార్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. జనవరి 13వ తేదీ కోసం చిరు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర భారీ పండగ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -