రైతుబంధు కోసం రూ.6900 కోట్లు రిలీజ్‌..

646
rythu bandhu
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రైతులకు శుభవార్తనందించిన తెలంగాణ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో రైతు బంధు సాయాన్ని వేసేందుకు సిద్ధమైంది. రైతుబంధు పథకం అమలుకోసం ₹ 6900 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌(బీఆర్‌వో)ను విడుదల చేసింది.

ఇక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతుబంధు పంట సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతు బంధు పథకం పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా ఏర్పాటయ్యే ఈ కమిటీలో 5 గురు సభ్యులు ఉంటారు.

మొత్తం రైతుబంధు లబ్ధిదారులు 54 లక్షల 50 వేల మంది ఉన్నారు. ఈసారి ఆర్బీఐ ప్లాట్ ఫాం ఈ క్యుబర్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైతుల అకౌట్లలోకి డబ్బుల బదిలీ చేయనున్నారు.

ఈసారి పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు సాయం నిలిపేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, గతంలో ఎంత మంది రైతుల‌కు రైతు బంధు ఇచ్చామో ఈ సారి కూడా అంతే మందికి సాయం అందజేస్తామని చెబుతున్నారు.

- Advertisement -